News March 2, 2025

ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. చంద్రబాబు పాత్రలో నటించేది ఎవరంటే?

image

సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్‌లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News March 3, 2025

తెలుగు సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!

image

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. సుధీర్ బాబుకు జోడీగా ఆమె ‘జటాధర’ అనే సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. గతేడాది తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. చివరిసారిగా ఆమె పీరియాడిక్ డ్రామా ‘హీరామండి’, హారర్ కామెడీ ‘కాకుడ’లో కనిపించారు.

News March 3, 2025

మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి

image

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్‌, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.

News March 3, 2025

Skypeను షట్‌డౌన్ చేస్తున్న మైక్రోసాఫ్ట్

image

2025, మార్చి 5 నుంచి Skypeను షట్‌డౌన్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కొవిడ్ టైమ్‌లో తామే తీసుకొచ్చిన Teams వన్ ఆన్ వన్ కాల్స్, గ్రూప్ కాల్స్, ఫైల్ షేరింగ్ సహా దాని కన్నా మెరుగైన ఫీచర్స్ అందిస్తుందని తెలిపింది. యూజర్లు దీనినే ఎక్కువ వాడుతున్నారని పేర్కొంది. VoIP టెక్‌తో వీడియో కాన్ఫరెన్స్, వీడియో టెలిఫోనింగ్, వాయిస్ కాల్స్ ఫీచర్స్ స్కైప్ ప్రత్యేకత. ప్రస్తుతం దీనికి 36m యూజర్లు ఉన్నారు.

error: Content is protected !!