News March 2, 2025
జగిత్యాల: ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

జగిత్యాల మున్సిపల్ పరిధిలోని టీఆర్ నగర్‌కు చెందిన షేక్ రఫీ అనే ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శనివారం సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిన రఫీ ఆదివారం తెల్లవారుజామున టీఆర్ నగర్‌లోని మీ సేవ కేంద్రం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
కర్నూలు జిల్లాలో 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయి..!

మెగా డీఎస్సీకి అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయని DEO శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 64, మున్సిపల్ కార్పొరేషన్ 7, మున్సిపాలిటీ పరిధిలో 12, ట్రైబల్ /చెంచుల విభాగంలో 5 ఐదు పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నారు. టీచర్ పోస్టుల భర్తీ తుది జాబితా https://www.deokrnl13.blogspot.comలో అందుబాటులో ఉంచామన్నారు
News September 16, 2025
ప్రకాశం: రాక్సీ వచ్చేసింది.. గంజా నేరగాళ్లకు ఇక చుక్కలే.!

నేరాల నియంత్రణలో పోలీస్ జాగిలాలు నిర్వహించే విధులను అభినందించాల్సిందే. అలాంటి చురుకైన జాగిలం రాక్సీ ప్రకాశం పోలీసుల చెంతకు చేరింది. ప్రత్యేక శిక్షణతో గంజాయిని వాసనతో పసిగట్టడం దీని ప్రత్యేకత. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాక్సీని పోలీసులు రంగంలోకి దించారు. తొలి ప్రయత్నంలోనే గంజా ముఠా ఆటకట్టించింది. <<17720866>>సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో<<>> రాక్సీ సైలెంట్‌గా గంజాయి బ్యాగులను గుర్తించింది.
News September 16, 2025
TPT : కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ప్రాజెక్టు అసోసియేట్-01, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్ -01 మొత్తం 3 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27.