News March 2, 2025
అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల మరణాలు: కాటసాని

ఆత్మకూరులో అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే తాగునీటి కలుషితమై ముగ్గురు మృతి చెందారని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. 3 నెలలుగా కాలనీలో తాగునీటి కలుషితం జరుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలన్నారు.
Similar News
News December 8, 2025
జగిత్యాల: ‘గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ అశోక్ కుమార్, వచ్చిన ఆరుగురు అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేస్తూ, స్టేషన్లలో వినతులను మర్యాదగా స్వీకరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
News December 8, 2025
చాట్రాయి: సామాన్యుల సమస్యలపై స్పందించిన మంత్రి

చనుబండలో సామాన్యులు చెప్పిన సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి కొలుసు సారథి, సొంత ఖర్చులతో డ్రైనేజీలో తూరలు వేయించారు. సోమవారం చనుబండలో మంత్రి ఈ పనులు పూర్తి చేయించడంతో బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 48 గంటల క్రితం మంత్రి గ్రామానికి వచ్చిన సందర్భంలో ప్రజలు సమస్యను ప్రత్యక్షంగా చూపించారని, వెంటనే పనులు పూర్తి చేయడం సంతోషదాయకంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
News December 8, 2025
ఖమ్మం: 1064 టోల్‌ఫ్రీతో అవినీతికి అడ్డుకట్ట: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌లను సోమవారం ఆవిష్కరించారు. 1064 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ పనికైనా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.


