News March 22, 2024
ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
Similar News
News October 31, 2025
నరసాపురం: సినీ గాయకుడు రాజు కన్నుమూత

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ‘పాడుతా తీయగా’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలోని “తార తలుకు తార” పాటతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.
News October 31, 2025
ప.గో: డెడ్ బాడీ పార్సిల్ కేసులో రాష్ట్రానికి 4 అవార్డులు

ఉండి (M) యండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు చేధనలో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ నయీమ్ అస్మితో పాటు మరో ముగ్గురు అధికారులు అవార్డులు అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్‌లో అవార్డులు ప్రకటించారు. అవార్డులు అందుకున్న నలుగురు అధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు.
News October 31, 2025
తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం: కలెక్టర్

తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను కలెక్టర్ నాగరాణి గురువారం వివరించారు. ఈ తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం అయ్యాయని, 13 గ్రామాలు, 6 పట్టణాలు నీట మునిగాయని తెలిపారు. మొత్తం 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 93 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.


