News March 22, 2024
TDP లిస్ట్.. అమలాపురం, కాకినాడ సిటీ అభ్యర్థులు వీరే!

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.
Similar News
News September 27, 2025
‘కొవ్వూరులో 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యం’

కొవ్వూరు డివిజన్లో ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణకు సుమారు 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యమని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. శుక్రవారం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలను ఒకే సారి ప్రారంభించి ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం చెల్లింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News September 27, 2025
ధవలేశ్వరం: మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద

గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు వివరించారు. 3 పంట కాలువలకు 10,600 క్యూసెక్కుల జలాలను అధికారులు విడుదల చేశారు. గోదావరికి వరద మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
News September 25, 2025
కౌలు రైతులకు రుణాలు అందించాలి: కలెక్టర్

సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకులు రైతులకు ఇచ్చే పాస్‌బుక్‌లలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలు రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.