News March 2, 2025
ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 7, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా సమాచారం

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు, నిల్వ 20.18 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్ట్‌కు మొత్తం 27,624 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HMWSకు 299, NTPCకి 121 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 27,204 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

HYDలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకానుంది. చారిత్రక లార్డ్స్, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి దిగ్గజ స్టేడియాలకు తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీలో 2 ఏళ్లలో దీన్ని తీర్చిదిద్దాలని CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు ‘వే2న్యూస్’కు అధికారులు తెలిపారు. దీనిపై అధ్యయనానికి మాజీ క్రికెటర్లతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రవాణా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని RR(D) కందుకూరులో ఏర్పాటుచేసే అవకాశముంది.
News November 7, 2025
రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ‘వందేమాతరం’

వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయం గ్రౌండ్‌లో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ గితే వందేమాతరం ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


