News March 2, 2025
నిర్మల్ : అత్యధికం… అత్యల్ప ఉష్ణోగ్రత ఇక్కడే..!

మార్చ్ నెల అనగానే గుర్తుకు వచ్చేది వేసవి కాలమే.. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెల నుంచి మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కూడా జాo గ్రామంలో నమోదు కావడం విశేషం. జిల్లాలో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు అయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Similar News
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.
News January 16, 2026
CTR: మామిడి రైతులకు బకాయిలు అందేనా.?

మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు అందించాల్సిన బకాయిలు ఇంతవరకు అందకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో సీజన్ ప్రారంభానికి సిద్ధమైనా ఇంతవరకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదు. రూ.50 కోట్ల వరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీలు అందించాల్సి ఉంది. గత సీజన్లో ప్రభుత్వం కిలో తోతాపూరికి రూ.4 రాయితీ చెల్లించగా.. ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది.
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌లో ఉద్యోగాలు

నోయిడాలోని<


