News March 22, 2024
ఈ సారి విశాఖ ఎంపీగా నెగ్గేదెవరు?

టీడీపీ మూడో జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా భరత్ మరోసారి బరిలో దిగుతున్నారు. అటు వైసీపీ బొత్స ఝాన్సీ పోటీచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రచారం చేస్తుండగా, అధికారిక ప్రకటనతో మరింత ఊపందుకోనుంది. ఈ సారి విశాఖలో ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 24, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News January 24, 2026
విశాఖలో 392 మందికి నియామక పత్రాల అందజేత

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళా ప్రవేశపెట్టిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాలో మంత్రి పాల్గొని 392 మందికి నియామక పత్రాలు అందజేశారు.
News January 24, 2026
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు.. రూ.23 వేల కోట్ల ఆదాయం

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని కేవలం 294 రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 రోజులు ముందే కావడం విశేషం. మొత్తం ఆదాయంలో 11.21%, సరుకు రవాణాలో 11.31% వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ రైల్వేలోనే నంబర్ వన్ జోన్‌గా నిలిచింది. ఈ వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా వెల్లడించింది.


