News March 2, 2025
మాజీ స్పీకర్ చిత్రపటానికి MHBD కలెక్టర్ నివాళి

దుదిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ హాజరయి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.
News November 8, 2025
ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.
News November 8, 2025
48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్

రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ‘48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత నేనే వచ్చి తేలుస్తా’ అని హెచ్చరించారు.


