News March 2, 2025
కూడేరు రోడ్డు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సరస్వతి(32) అక్కడిక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ(42), యోగేశ్వరి(40) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జ్ఞానాన్షిక, అచ్చిత్ కుమార్ స్వామి, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెన్నహోబిలం నుంచి అనంతపురం PVKK కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టారు.
Similar News
News January 20, 2026
ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్‌టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News January 20, 2026
అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.


