News March 22, 2024
‘ఓం భీమ్ బుష్’ మూవీ REVIEW

ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా నచ్చినట్లుగా ముగ్గురు ఫ్రెండ్స్ చేసే సిల్లీ పనులే ‘ఓం భీమ్ బుష్’ కథ. తమ కామెడీ టైమింగ్స్‌తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అలరించారు. శ్రీవిష్ణు పంచ్‌లు, బాడీ లాంగ్వేజ్, హర్రర్ సీన్స్, కీలక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా.. స్టోరీ లైన్, లాజిక్ లేని సీన్స్, మ్యూజిక్, ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్ర, స్క్రీన్‌ప్లే మైనస్.
RATING: 2.50/5
Similar News
News April 10, 2025
‘విశ్వంభర’ ఆలస్యం వెనుక అదే కారణం?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ను ఈ ఏడాది జనవరికే విడుదల చేయాలనుకున్నా దాన్ని తర్వాత వాయిదా వేశారు. మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకు నచ్చకపోవడమే వాయిదా వెనుక కారణమని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కీరవాణి కొత్త ట్యూన్ ఇచ్చే పనిలో ఉన్నారని వెల్లడించాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్స్ వేయనున్నారని స్పష్టం చేశాయి.
News April 10, 2025
బ్యాడ్మింటన్ ఆసియా: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సింధు

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ఎస్తేర్ వార్డోయోపై ఆమె వరస సెట్లలో 21-15, 21-19 తేడాతో గెలుపొందారు. తర్వాతి రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకానీ యమగుచీతో ఆమె తలపడనున్నారు. మరోవైపు లక్ష్యసేన్, ప్రణోయ్ ఇద్దరూ ఇంటిబాట పట్టారు.
News April 10, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి టీటీడీ లడ్డూలు

AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం రేపు సాయంత్రం 6.30 గంటల నుంచి కన్నులపండువగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం టీటీడీ 70వేల లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో సేవకులు ఈ లడ్డూల ప్యాకింగ్ పూర్తి చేశారు. రేపు కళ్యాణం అనంతరం భక్తులకు వీటిని పంచిపెట్టనున్నారు.