News March 2, 2025
కాగజ్‌నగర్‌లో ట్రైన్ ఢీకొని మహిళ మృతి

కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నంబర్ 3పై గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేశ్ ఆదివారం తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. మృతురాలి సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Similar News
News December 29, 2025
తిరుపతి నుంచి గూడూరు ఔట్.. కానీ!

గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను మాత్రమే నెల్లూరులో కలిపారు. చిట్టమూరు, వాకాడు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి. వాకాడులో దుగరాజపట్నం పోర్ట్ కారణంగానే ఆ మండలాన్ని తిరుపతిలో కొనసాగించనున్నారు. చిట్టమూరు సైతం తిరుపతికి దగ్గరగా ఉంటుంది.
News December 29, 2025
మంత్రులు, MLAలు సిద్ధంగా ఉండాలి: CM

TG: నీళ్ల సెంటిమెంట్‌తో BRS తమపై అటాక్ చేయాలని చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష నేతల విమర్శలు, ఆరోపణలను సమర్థంగా తిప్పి కొట్టాలి. JAN 1న సాయంత్రం 4 గం.కు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నదీ జలాలు, నీటి వాటాలపై జరిగిన తప్పిదాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి’ అని తెలిపారు.
News December 29, 2025
ప్రజా ఫిర్యాదుల వేదికలో 101 విన్నపాలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 101 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.


