News March 2, 2025

అల్లూరి: చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

image

ముంగర్లపాలెంలో చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు ఆదివారం తెలిపారు. జీ మాడుగుల మండలం గడుతూరుకు చెందిన గెమ్మెలి శేఖర్‌ తన చిన్నాన్న గ్రామమైన మండలంలోని సీతకండికి కూలీ పనుల నిమిత్తం వచ్చాడు. ఈ క్రమంలో ముంగర్లపాలెంలో చింతచెట్టు ఎక్కగా చెట్టుపై నుంచి పడిపోవడంతో మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు.

Similar News

News July 9, 2025

పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

image

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.

News July 9, 2025

మెగా పేరెంట్స్ డే ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్, ప్రభుత్వ, జూనియర్ కళాశాల యజమానులు, విద్యాశాఖ అధికారులతో మెగా పేరెంట్స్ డే నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు క్రమ పద్దతిలో, మధ్యాహ్న భోజనం అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం, తల్లికి వందనం లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.

News July 9, 2025

బాపట్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామం సమీపంలోని నాగరాజు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాపట్ల రూరల్ పోలీసులు కథనం మేరకు.. కప్పల వారి పాలెం గ్రామంలోని నాగరాజు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.