News March 2, 2025

పిట్లం: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలం కోమటి చెర్వు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు వివరాలిలా.. కోమటి చెర్వు తండాకు చెందిన రమావత్ అనిల్(22) గత కొన్నేళ్లుగా మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News January 16, 2026

మెదక్: రోడ్డు భద్రతపై సిబ్బందికి అవగాహన

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఉద్యోగులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవోలు పాల్గొన్నారు.

News January 16, 2026

మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

image

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.

News January 16, 2026

జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.