News March 22, 2024
బెజవాడ గడ్డపై అన్నదమ్ముల పోరు..

AP: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి కేశినేని నాని, TDP తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ TDP గెలిచిన MP సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.
Similar News
News April 10, 2025
IPL: ఈరోజు బెంగళూరుతో ఢిల్లీ ఢీ

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ, ఢిల్లీ తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో డీసీ రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో నేటి పోరు హోరాహోరీగా జరగొచ్చు. డీసీ హ్యాట్రిక్స్ విన్స్‌తో ఉండగా ఆర్సీబీ ఓడుతూ, గెలుస్తూ వస్తోంది. ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.
News April 10, 2025
రాజీవ్ యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

TG: నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 9.5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14న తుదిగడువు కాగా ఆలోపు దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు.
News April 10, 2025
కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

అహ్మదాబాద్‌లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.