News March 3, 2025

VSKP.. మధురానగర్‌లో బంగారం చోరీ

image

విశాఖలోని మధురానగర్ రాధవ్ మాధవ్ టవర్స్‌లో దొంగలు పడ్డారు. ఇంటి యజమానికి కృష్ణ కాకినాడలో బంధువులు ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని ఎదురిటివారు కృష్ణకు ఆదివారం ఫోన్ చేశారు. దీంతో వెంటనే బంధువులతో కలిసి వచ్చి చూడగా ఇంట్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News January 13, 2026

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 10 మందికి మెమోలు

image

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు కలెక్టర్‌‌ హరేంధిర ప్రసాద్ మెమోలు జారీ చేశారు. సోమవారం PGRSలో అర్జీలపై సమీక్షించారు. టౌన్‌ప్లానింగ్‌, హౌసింగ్‌ విభాగాల్లో తూతూమంత్రంగా ఎండార్స్‌మెంట్లు ఇస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 4, 5, 6, 8వ జోన్‌లలో సంబంధిత కమిషనర్‌లకు, టౌన్‌ప్లానింగ్‌, DE, ASOలకు మెమోలు జారీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోడల్‌ అధికారి శేషశైలజను ఆదేశించారు.

News January 13, 2026

విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

image

ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీ‌హెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.

News January 13, 2026

విశాఖ: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.