News March 3, 2025

మోత్కూరులో యువతి సూసైడ్

image

ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఆరెగూడెంకు చెందిన మున్నకు కృష్ణా జిల్లా కొడాలి గ్రామానికి చెందిన బాలికతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఒక్కటైన ఇద్దరు మోత్కూరులో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం బాలిక ఇంట్లో ఉరేసుకుంది. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 3, 2026

మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.

News March 3, 2026

మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

image

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.

News March 3, 2026

NGKL: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

వనపర్తి జిల్లాలో సెంట్రింగ్ పనులు ముగించుకుని బైక్‌పై వస్తుండగా చిట్యాల వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మహాదేవునిపేట వాసులు హేమంత్(19), శ్రీకాంత్, విజయేందర్‌లు పని ముగించుకుని వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని MBNR ఆసుపత్రికి తరలిస్తుండగా.. హేమంత్ మార్గంమధ్యలో మృతిచెందారు.