News March 3, 2025

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా విక్రమ్‌కుమార్

image

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్‌కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్‌ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్‌కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 30, 2025

మైనారిటీలపై మీ రికార్డు చూసుకోండి.. పాక్‌కు ఇండియా కౌంటర్

image

ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. మైనారిటీల విషయంలో పాక్ అధ్వాన రికార్డు అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. ‘వివిధ మతాలకు చెందిన మైనారిటీలను పాక్ దారుణంగా, ప్లాన్ ప్రకారం బాధితులుగా మారుస్తుందనేది నిజం. మా వైపు వేలు చూపించినంత మాత్రాన అదేమీ మారదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

News December 30, 2025

డిసెంబర్ 30: చరిత్రలో ఈరోజు

image

✒1879: భగవాన్ రమణ మహర్షి జననం
✒1898: స్వాతంత్ర్య సమర యోధుడు యలమంచిలి వెంకటప్పయ్య జననం
✒1971: భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్‌ మరణం(ఫొటోలో)
✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం
✒1906: ముస్లిం లీగ్ పార్టీ స్థాపన

News December 30, 2025

వరంగల్: గర్భిణీ అండాశయం నుంచి 3.5 కిలోల కణతి తొలగింపు!

image

సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సింధు వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సోమవారం ప్రసవం కాగా 3.5 కిలోల ఆడ శిశువుకు జన్మించింది. అదే సమయంలో అండాశయం ఉన్న 3.5 కిలోల కణతిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసి విజయవంతంగా తొలగించినట్లు ఆస్పత్రికి సూపరింటెండెంట్ డా.లక్ష్మీదేవి తెలిపారు. అస్త్రం ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు.