News March 3, 2025

ఆదిలాబాద్: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3న సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

Similar News

News March 3, 2025

ADB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJP తరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతిచ్చింది.

News March 3, 2025

గుడిహత్నూర్: పురుగు మందు తాగి బాలిక సూసైడ్

image

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.

News March 3, 2025

ఆదిలాబాద్: కౌంటింగ్ షురూ… అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ జిల్లాలో ఇటీవ‌ల ప్ర‌శాంతంగా ముగిసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించిన ఫ‌లితాల ప్రక్రియ ప్రారంభమైన నేప‌థ్యంలో పోటీచేసిన అభ్య‌ర్థుల‌లో ఉత్కంఠ రేపుతోంది. ఎవ‌రి భవిత‌వ్యం ఎలా ఉండ‌బోతుందో తేలిపోనుంది. మొత్తం14935 మందికి గాను 10,396 మంది ఓటు వేయ‌గా 69.61 శాతం పోలింగ్ న‌మోదైంది. అలాగే టీచ‌ర్స్ 1,593 మంది ఉండ‌గా 1,478 మంది త‌మ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

error: Content is protected !!