News March 3, 2025

KPHBలో నేపాల్ వాసి ఆత్మహత్య.. 

image

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. KPHB 4వ ఫేజ్‌లోని LIG 213/2లో నివాసముండే ప్రేమ రావల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నేపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం KPHBలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

Similar News

News September 18, 2025

eAadhaar App.. ఇక మనమే అప్డేట్ చేసుకోవచ్చు!

image

ఆధార్ కార్డులో అప్‌డేట్స్ కోసం ఇక ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం eAadhaar App తీసుకొస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల డిజిటల్ ఆధార్ సేవలు సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నవంబర్‌లో యాప్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

News September 18, 2025

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి రోజారమణిపై సర్వత్రా ప్రసంశలు

image

సంచలన తీర్పులతో పోక్సో చట్టం ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి రోజారమణి సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి. జూలై 4 నుంచి 16 వరకు ఆమె 10 కేసులలో తీర్పులివ్వగా, అందులో ఒక కేసులో ఉరిశిక్ష, మిగతా కేసులలో 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తూ తీర్పులిచ్చారు. బాధితులకు ₹.5 లక్షల-₹.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా ఓ తీర్పులో దోషి ఊశయ్యకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

News September 18, 2025

సంగారెడ్డి: ‘చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి’

image

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. పోషణ మాసోత్సవాలలో భాగంగా సంగారెడ్డి మండలం అంగడిపేట అంగన్వాడీ కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతోనే పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.