News March 3, 2025

సిద్దిపేట: ఐఐటీలు ఆవిష్కరణకు వేదిక కావాలి: ఉపరాష్ట్రపతి

image

ఐఐటీలో నూతన ఆవిష్కరణకు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి ఐఐటీ విద్యార్థులు తోడ్పాటు అందించాలని చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

image

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.

News July 7, 2025

ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 7, 2025

బల్దియా సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

image

అట్టహాసంగా ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కొద్దీ సేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి బయటకు వచ్చారు. భద్రకాళి చెరువు విషయంలో చర్చ లేవనెత్తడంపై మేయర్ సుధారాణి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు అసహనానికి గురయ్యారు. దీంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికు వచ్చి నిరసన చేపట్టారు.