News March 3, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 3, 2025
మనసు ‘దోశే’సిన వంటకం!

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.
News March 3, 2025
జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా గృహాలకు సరఫరా అవుతున్న తాగునీటికి సంబంధించిన పైపులైన్లను తనిఖీ చేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు మంచినీటి ప్రణాళికలను తయారు చేసుకోవలన్నారు.
News March 3, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు నాయుడు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసుల నాయుడు 710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రోజు నుంచి ముగ్గురు మధ్య పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రతి రౌండ్లో శ్రీనివాసులు నాయుడు కొంతమేరకు ఆదిక్యం కనపరుస్తూనే వచ్చారు. చివరకు ఎలిమినేషన్ రౌండ్-2 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు గెలుపొందినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.