News March 3, 2025
ఆసిఫాబాద్: ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల దృశ్య ఓట్ల లెక్కింపు కారణంగా ప్రజా ఫిర్యాదుల విభాగం సోమవారం వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు.
Similar News
News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.
News November 7, 2025
HYD: ఎన్నికల సమయంలో సోదాలు సహజం: పొన్నం

ఎన్నికల సమయంలో సోదాలు జరగడం సహజమని, అవి ఎవరి ఇంట్లో అయినా చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సోదాలు నిర్వహించడం ఎన్నికల సంఘం హక్కని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
News November 7, 2025
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో ‘వందేమాతరం’

వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అధికారులు కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం ప్రజలలో దేశభక్తి, ఐక్యత, సమానత్వాన్ని నింపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.


