News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News September 17, 2025
SRCL: ‘మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి’

మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ‘స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన పెంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 16, 2025
సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.
News September 16, 2025
ఈనెల 18న వేములవాడ హుండీ లెక్కింపు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈనెల 18న ఉదయం 8 గంటలకు జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని చెప్పారు. అధికారుల సమక్షంలో, లెక్కింపు కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.