News March 3, 2025

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

image

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 3, 2025

కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

News March 3, 2025

కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు: గవాస్కర్

image

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్‌కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.

News March 3, 2025

మనసు ‘దోశే’సిన వంటకం!

image

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.

error: Content is protected !!