News March 3, 2025
బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
Similar News
News July 6, 2025
సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
నేడు మంగళంపల్లి జయంతి

నేడు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తంలో 1930 జులై 6న జన్మించిన బాలమురళీకృష్ణ, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన సంగీత లోకానికి అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆయన పాడిన పాటల్లో ఈ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.