News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 13, 2025

దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: GWMC కమిషనర్

image

పీఎం స్వానిధి పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 5,600 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. బల్దియా పరిధిలో రూ.15,000 నుంచి రూ.50,000 వరకు రుణాల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని డిసెంబర్ 2లోగా పూర్తి చేయాలని మెప్మా అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు.

News November 13, 2025

నవంబర్ 13: చరిత్రలో ఈరోజు

image

1780: సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం
1920: గణిత శాస్త్రవేత్త కె.జి.రామనాథన్ జననం
1925: నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం
1935: సినీ గాయకురాలు పి.సుశీల జననం (ఫొటోలో లెఫ్ట్)
1973: స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం
2002: కవి కాళోజీ నారాయణరావు మరణం (ఫొటోలో రైట్)
2010: సినీ నిర్మాత డి.వి.యస్.రాజు మరణం

News November 13, 2025

దానవాయిగూడెం గురుకులంను మోడల్‌గా మారుస్తాం: పొంగులేటి

image

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.