News March 3, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మతో సింగరేణికి సంబంధించిన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.

Similar News

News March 4, 2025

రాత్రిపూట నేలపై పడుకుంటే..

image

వేసవి వచ్చేసింది. ఉక్కబోత అల్లాడించే ఈ కాలంలో పరుపు నుంచి కూడా వేడి వస్తుంటుంది. అసలే రోజంతా పనులతో అలసిపోయిన శరీరం కునుకు తీసేందుకు పరుపుపై వాలగానే ఏదో అసౌకర్యం. అలాంటప్పుడు చక్కగా నేలపై నిద్రపోవడం చాలా మంచిదంటున్నారు జీవనశైలి నిపుణులు. చల్లటి నేలపై మంచి నిద్రే కాక ఒళ్లు నొప్పులకూ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నేలపై నిద్రను హాయిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.

News March 4, 2025

క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్‌ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.

News March 4, 2025

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

image

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

error: Content is protected !!