News March 3, 2025
NLG: 113 కేంద్రాలు.. 58,222 మంది విద్యార్థులు

ఉమ్మడి NLG జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్‌ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 58,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News March 3, 2025
నల్గొండ: MLC కోదండరామ్‌కు బిగ్ షాక్

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరాంకు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
News March 3, 2025
నల్గొండ: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.
News March 3, 2025
నల్గొండ: భర్త దాడి.. భార్య మృతి

భార్యపై భర్త దాడి చేయగా ఆమె మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండారు మహేశ్వరి(23)కి కేతేపల్లి మండలం బండకిందగూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా, భార్యపై అనుమానంతోనే భర్త ఆమెపై ఈనెల 1న సర్వారంలో దాడి చేశాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా ఇవాళ కన్నుమూసింది.