News March 3, 2025
కట్నం కోసం వేధిస్తున్న భర్తకు జైలు శిక్ష: ఎస్పీ

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎస్.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన జామి అప్పలరాజు కటకటాలపాలయ్యాడు. 13వ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఆదివారం తెలిపారు. భార్య ధనలక్ష్మి 2015 ఫిబ్రవరి 20వ తేదీన అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
Similar News
News July 6, 2025
ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
News July 6, 2025
సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు: కలెక్టర్

సిగాచీ పరిశ్రమలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. 34 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించినట్లు వివరించారు.
News July 6, 2025
ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.