News March 3, 2025
ఉమ్మడి కృష్ణా-గుంటూరు MLC ఎన్నికల్లో గెలుపెవరిది.!

కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి, KS లక్ష్మణరావు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలో 69.57% మేర పోలింగ్ జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో ఉన్న 2 ఉమ్మడి జిల్లాలలో జరిగిన ఎలక్షన్ కావడంతో నేటి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారని మీరునుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News September 13, 2025
నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.
News September 12, 2025
నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
News September 12, 2025
తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.