News March 3, 2025

అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

image

అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, మీ అమౌంట్ రెట్టింపు చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీ సమాచారం చెప్పవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్‌కు లేదా, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 26, 2025

వెంకటగిరిలో భారీ దొంగతనం

image

వెంకటగిరిలో భారీ దొంగతనం వెలుగు చూసింది. తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణయ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన బుధవారం ఊరికి వెళ్లారు. ఆయన ఇంటి తాళం తెరిచి ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించి కృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. 60 సవర్ల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలు, రూ.2లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

News December 26, 2025

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

image

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.