News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News March 1, 2026
పెద్దపల్లి: 45 ఏళ్లకు ఇల్లు చేరిన ‘మల్లోజుల’

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం పెద్దపల్లిలోని తన నివాసానికి అతడి భార్య తారతో కలిసి చేరుకున్నారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. 1980లో ఉద్యమ బాట పట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించడం గమనార్హం.
News March 1, 2026
పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం: రామచంద్రరావు

గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందన్నారు.
News March 1, 2026
రెబ్బెన: ఇంట్లో యువకుడి సూసైడ్

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) శనివారం రాత్రి తన నివాసంలో తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.


