News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
కృష్ణా: విషాదం.. చెరువులో 60 రోజుల చిన్నారి మృతదేహం లభ్యం

మోపిదేవి మండలం వెంకటాపురంలో 2 నెలల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 60 రోజుల వయసున్న చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువులో లభ్యమైంది. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ ఈశ్వర్‌రావు, ఎస్ఐ గౌతమ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి మృతికి గల కారణాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News January 2, 2026
గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.
News January 2, 2026
గౌరవం, నమ్మకం మరింత పెరిగేల సేవ చేయాలి: కలెక్టర్

రెవెన్యూ డిపార్ట్మెంట్పై గౌరవం, నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.


