News March 3, 2025

చీపురుపల్లిలో యాక్సిడెంట్.. లైన్మెన్ మృతి

image

పాలవ్యాను ఢీకొని లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. పేరిపికి చెందిన కర్ణపు సత్యం(43) చీపురుపల్లి ఆర్ఈ‌సీఎస్‌లో లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమ్మవారి జాతరలో విధుల్లో భాగంగా ఆంజనేయపురం వైపు వెళ్తుండగా.. చీపురుపల్లి టీడీపీ ఆఫీసు ఎదురుగా పాలవ్యాను ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News December 30, 2025

VZM: ‘తక్కువ వడ్డితో ఈ సొసైటితో రుణాలు పొందండి’

image

పోలీసు సిబ్బంది ఆర్థిక అవసరాలు తీర్చేందుకే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు SP ఏ‌ఆర్ దామోదర్ తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు. తక్కువ వడ్డీతో ఈ సొసైటీ ద్వారా రుణాలు పొందే పోలీసు ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతున్నారన్నారు. త్వరలో జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీకి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు.

News December 30, 2025

VZM: ‘కూటమి విద్య, వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది’

image

కూటమి ప్రభుత్వం నేడు విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే నేడు కూటమి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారన్నారు. కొత్తగా జిల్లాకు ఏదైనా పరిశ్రమని తీసుకొని వచ్చారా? అని ప్రశ్నించారు.

News December 30, 2025

రైలు నుంచి జారిపడి గుర్ల యువకుడి మృతి

image

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం స్వగ్రామానికి వస్తున్న యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. విజయనగరం (D) గుర్ల (M) గొలగం గ్రామానికి చెందిన కంది సాయిరాం (26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలోనే రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులు సాయిరాం కుటుంబ సభ్యులకు మంగళవారం తెలిపారు.