News March 3, 2025

కోనసీమ: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.

Similar News

News January 5, 2026

మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.

News January 5, 2026

అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

image

అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో నిన్న టీడీపీలో చేరారు. ముందుగా వేలాది మంది అనుచరులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియాజ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వైసీపీ జెండా మోసినా తనకు గుర్తింపు దక్కలేదన్నారు.

News January 5, 2026

జీ.మాడుగుల: విలువైన గంధం చెట్లు నరికివేత

image

జీ.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన సిరి గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసి, అపహరించుకు పోయారు. ఉర్లమెట్టకు ఆనుకొని ఉన్న కొండపై విలువైన గంధం చెట్లను కొట్టుకుని పోయారు. ఇది స్మగ్లర్ల పనేనని స్థానికులు భావిస్తున్నారు. ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదివారం కోరారు.