News March 22, 2024

కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీకి కారణాలేంటి?

image

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు BJP చీఫ్ అన్నామలై గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం, ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు అన్నామలైకు ఉండటం పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇటీవల ఇక్కడ PM పర్యటించడం, 1998 బాంబు బ్లాస్ట్‌లో చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం కూడా ప్లస్ అవ్వొచ్చని భావిస్తున్నారు.

Similar News

News September 10, 2025

మళ్లీ భారీ వర్షాలు

image

TG: నేటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News September 10, 2025

ఈ కారు ధర రూ.30 లక్షలు తగ్గింది

image

జీఎస్టీ కొత్త శ్లాబుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోడళ్లను బట్టి ఈ కారు ప్రైజ్ రూ.4.5లక్షల నుంచి రూ.30.4లక్షలు తగ్గడం విశేషం. అయితే రేంజ్ రోవర్ బేసిక్ మోడల్ రేటు రూ.2 కోట్లకు పైమాటే. ఇక ఇదే కంపెనీకి చెందిన డిఫెండర్‌పై రూ.7-రూ.18.60 లక్షలు, డిస్కవరీపై రూ.4.5-రూ.9.90 లక్షల మేర తగ్గింపు వర్తించనుంది.

News September 10, 2025

నేడు రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం, HYDలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అనంతరం HYDకు తిరిగి వస్తారు.