News March 3, 2025

విశాఖలో విదేశీయుల నాటక ప్రదర్శన

image

సాగర్ నగర్‌లోని ఇస్కాన్ మందిరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన వామన దేవుని అవతారం అంతర్జాతీయ నాటకంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. విదేశాలకు చెందిన కళాకారులు భారతీయ సాంప్రదాయాన్ని, ఇతిహాసాలను అద్భుతంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా నుంచి వచ్చిన కళాకారుల బృందం కెనడాకు చెందిన స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

Similar News

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.

News September 14, 2025

రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

image

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.

News September 14, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.