News March 3, 2025
త్వరలో ఏపీ పర్యటనకు మోదీ?

AP: కృష్ణా జిల్లా నాగాయలంక(మ) గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News December 31, 2025
అతిపెద్ద జిల్లాగా కడప

ఏపీలో జిల్లాల పునర్విభజనతో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా కడప నిలిచింది. గతంలో అనంతపురం తొలి స్థానంలో ఉండేది. రాజంపేట నియోజకవర్గం జిల్లాలో చేరడంతో 12,507 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భూభాగ పరంగా మొదటి, 22.96 లక్షల ప్రజలతో జనాభా పరంగా రెండోస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. జనాభా పరంగా చూస్తే 3,49,953 మందితో పోలవరం చివరి స్థానంలో ఉండే అవకాశముంది. కొత్త జిల్లాలపై పూర్తి గణాంకాలు తెలియాల్సి ఉంది.
News December 31, 2025
వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. ₹87,695 కోట్ల బకాయిలు ఫ్రీజ్!

వొడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ప్రస్తుతానికి నిలిపివేస్తూ ఐదేళ్ల పాటు మారటోరియం ప్రకటించింది. ఈ బకాయిలను 2031 నుంచి పదేళ్ల కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. టెలికం రంగంలో పోటీని కాపాడటానికి 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.
News December 31, 2025
పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్‌లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.


