News March 3, 2025

గుండుగొలను: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్‌పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

వరంగల్: పొట్ట దశలో వరి.. యూరియా మరి?

image

ఉమ్మడి ఓరుగల్లు రైతన్నకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ముందస్తుగా వరి నాట్లు వేసుకున్న పొలాలు దాదాపు పొట్ట దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు యూరియా వేసినా ఫలితం ఉండదని రైతులు అంటున్నారు. పొద్దున్నే PACS సెంటర్ దగ్గరకు సద్ది బువ్వ పట్టుకొని వెళ్లినా ఒక్క బస్తా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక యాసంగి నష్టపోతే, వానాకాలం పంటకు<<17717414>> ‘యూరియా’ <<>>తిప్పలు పెడుతోందని వాపోతున్నారు. మీ పంట ఏ దశలో ఉంది?

News September 16, 2025

75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

image

CBSE విద్యార్థులు టెన్త్, 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసెస్‌మెంట్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్‌రూం యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తోంది.

News September 16, 2025

అనేక మలుపులు తిరిగిన చౌటపల్లి సొసైటీ వ్యవహారం..!

image

చౌటపల్లి సొసైటీ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పాలకవర్గం రద్దయ్యింది. కార్యాలయానికి నూతన భవనం, గోదాం, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఖర్చుకు మించిన లెక్కలు రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆయా భవనాలను ప్రారంభించడానికి మంత్రి సీతక్క రావడంతో ఆమె ప్రోగ్రాం ఖర్చుని సైతం అధికంగా చూపారు. కేవలం అరటిపండ్లకే రూ.60 వేలు ఖర్చయినట్లు రాశారు. దీంతో ఆడిటింగ్ చేసి పాలకవర్గాన్ని రద్దు చేశారు.