News March 3, 2025

షాబాద్: రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

image

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందారు. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. కొత్తూరు మండలం మల్లాపూర్ తండాకు చెందిన మెగావత్ నైందు(27), షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కావలి రంజిత్ కుమార్ బైక్‌లు మద్దూరు సమీపంలో ఢీకొన్నాయి. దీంతో నైందు మృతిచెందగా.. రంజిత్, ఆయన మూడేళ్ల కొడుకు తీవ్రంగా గాయపడగా రంజిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి భార్య రాధిక ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News March 4, 2025

కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

image

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం దినేశ్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు ఎస్ఐ గుంపుల విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంతో గొడవకు దిగిన దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో గాయపరిచాడు. హెచ్ఎం గన్ను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 4, 2025

కొత్తగూడెం: ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపు

image

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీవోసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్‌లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు.

News March 4, 2025

ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు 

image

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.

error: Content is protected !!