News March 22, 2024
అందుకోసం మూడేళ్లు పనిచేసినా సాధ్యం కాలేదు: యాపిల్

యాపిల్ వాచ్‌లు ఆండ్రాయిడ్‌తో పనిచేయవు. ఇది గుత్తాధిపత్యమే అంటూ ఓ సంస్థ USలో దావా వేసింది. ‘ఎవరైనా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకుంటే, వారు తమ యాపిల్ వాచ్‌ను వదిలివేసి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలి. ఇది యూజర్లపై విపరీతమైన భారాన్ని వేస్తోంది’ అని వాదించింది. అయితే ఆండ్రాయిడ్‌తోనూ పనిచేసేలా రూపొందించేందుకు తాము మూడేళ్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని యాపిల్ వెల్లడించింది.
Similar News
News October 30, 2025
గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
News October 30, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News October 30, 2025
నేడు కాలేజీల బంద్‌కు SFI పిలుపు

TG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌తో SFI ఇవాళ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. BTech, ఫార్మసీ, మెడికల్, డిగ్రీ, PG కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని కోరింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు స్టూడెంట్స్ నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని SFI లీడర్లు ఆరోపించారు. దీని వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు.


