News March 3, 2025
అలంపూర్‌లో 39.0°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. సాధారణం కంటే గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మార్చి నెల ఆరంభంలోనే సాధారణం కంటే 2, 3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న 3 నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత 24 గంటల్లో అలంపూర్‌లో 39.0°C, మల్దకల్‌లో 38.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 8, 2025
అనకాపల్లి: ఈనెల 10 నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు

జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. అనకాపల్లిలో 10వ తేదీన 15-29 ఏళ్లలోపు యువ కళాకారులకు 7 విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సీఈవో కవిత పాల్గొన్నారు.
News November 8, 2025
ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 8, 2025
ఈరోజు మీకు సెలవు ఉందా?

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT


