News March 3, 2025

రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. CM రేవంత్ అధ్యక్షతన MAR 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 8 లేదా 10 నుంచి సభ ప్రారంభించి ఏప్రిల్ 3 వరకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులనూ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Similar News

News November 13, 2025

రేపటి తరానికి మార్గదర్శనం మన అలవాట్లే

image

మంచి అలవాట్లు మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి, ఇంట్లో పిల్లలకు ఆదర్శంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఆఫీస్‌ సమయానికి 20 నిమిషాల ముందు లేచి, హడావిడిగా సిద్ధమయ్యేవాడు. కొన్నాళ్లకు అతడి కుమారుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మనం నేర్పించే ప్రతి పాఠం, మన నడవడిక నుంచే మొదలవుతుంది. అందుకే, మన అలవాట్లు మనల్నే కాక, మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయని మరువకూడదు. మంచి అలవాట్లే నిజమైన వారసత్వం. <<-se>>#Jeevanam<<>>

News November 13, 2025

తెలంగాణ ముచ్చట్లు

image

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి

News November 13, 2025

పదునెట్టాంబడి అంటే ఏంటి?

image

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>