News March 22, 2024
27న పలమనేరులో చంద్రబాబు ప్రచారం

మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
చిత్తూరు: డీఆర్వోను కలిసిన ఫ్యాప్టో నాయకులు

12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా ఛైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. డీఆర్వో మోహనకుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెం.117ను రద్దు చేయాలని, తెలుగు మీడియాన్ని పునరుద్ధరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. 11వ PRC, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను తక్షణం చెల్లించాలని కోరారు.
News April 2, 2025
చిత్తూరు: ముగ్గురికి కాంస్య పతకాలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు (ఫిజికల్ డైరెక్టర్లు) సురేష్ కుమార్, ముత్తు, దేవేంద్ర సత్తా చాటారు. ముగ్గురికీ కాంస్య పతకాలు దక్కాయి. ఈక్రమంలో వారిని కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. సహకారం అందించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.
News April 2, 2025
ద్రవిడ వర్సిటీలో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి సంబంధించి MA, M.Com, M.Scలో చేరడానికి APPGCET-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ సూచించారు. మే 5వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. MBA/MCA కోర్సులో చేరటానికి APICET-2025 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు cets.apsche.ap.gov.in చూడాలి.