News March 3, 2025

మార్చిలోనే సుర్రుమనిపిస్తున్న సూర్యుడు

image

మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఎండల ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. సింగరేణి ప్రాంతం కనుక మిగతా జిల్లాలో కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News February 27, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.

News February 27, 2026

ఆదిలాబాద్: విద్యార్థినితో కలెక్టర్ చిట్ చాట్

image

విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బాలక్ మందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బల్లపై కలెక్టర్ కూర్చున్నారు. విద్యార్థినితో మాట్లాడి కాసేపు చిట్ చాట్ చేశారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్ ఉన్నారు.

News February 27, 2026

సంగారెడ్డి: తొలిసారిగా ‘హైడ్రోపోనిక్’ గంజా పట్టివేత

image

సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా హైడ్రోపోనిక్ గంజాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా దొరికింది. దీని విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేరళకు చెందిన బాబు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డీసీ హరికిషన్ వెల్లడించారు.