News March 3, 2025

భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Similar News

News January 18, 2026

NLG: మేయర్ పీఠంపై మూడు పార్టీల గురి!

image

NLG కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో అధికార పార్టీతో పాటు అటు BRS, ఇటు BJPలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 33వ వార్డు నుంచి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, BRS మాజీ ఛైర్మన్ సైదిరెడ్డి ఆయన భార్యను పోటీలో నిలుపుతుండగా, BJP నుంచి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు.

News January 18, 2026

సంగారెడ్డి: 23 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 23 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. 23, 24 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 30, 31 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈఓలకు సూచించారు.

News January 18, 2026

AUS టూర్‌కు మహిళల ODI, T20 టీమ్స్ ఇవే

image

FEB 15-MAR 1 మధ్య జరగనున్న టీమ్ ఇండియా ఉమెన్స్ AUS పర్యటనకు సంబంధిచి BCCI జట్లు ప్రకటించింది.
T20: హర్మన్(C), స్మృతి, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, అరుంధతి, అమన్‌జోత్, జెమీమా, ఫుల్మాలీ, శ్రేయాంక.
ODI: హర్మన్(C), స్మృతి, షెఫాలీ, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, కష్వీ గౌతమ్, అమన్‌జోత్, జెమీమా, హర్లీన్.