News March 3, 2025
ఏలూరు : పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.
Similar News
News October 29, 2025
ములుగు: సిద్ధంగా డీడీఆర్ఎఫ్ బలగాలు..!

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక్ష శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది సేవలందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా కొండాయి, ఏటూరునాగారం, మంగపేట, మేడారం వంటి వరద ముంపు ప్రాంతాలకు వీరిని పంపించేందుకు యోచిస్తున్నారు. గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి డీడీఆర్ఎఫ్ సేవలు కీలకం కానున్నాయి.
News October 29, 2025
మొంథా ప్రభావం.. ములుగులో 2.1 సెం.మీ. వాన

మొంథా తుఫాను ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సా.5 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. ములుగు మండలంలో 2.1 సెం.మీః, తాడ్వాయిలో 2, ఖాసీందేవిపేటలో 1.4 సెం.మీ. వాన పడింది. రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 29, 2025
MBNRలో భారీ వర్షం..ఈ మెసేజ్ వచ్చిందా?

ఉమ్మడి జిల్లాలోని MBNR, GDWL, WNPT,NRPT జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?


