News March 3, 2025
తూ.గో: పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల గ్యాడుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 28, 2025
మీకోసం వెబ్ సైట్‌లో అర్జీలు సమర్పించవచ్చు: అనకాపల్లి కలెక్టర్

అర్జీలను మీ కోసం వెబ్ సైట్‌లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేరుగా అర్జీలను స్వీకరిస్తామన్నారు. అంతే కాకుండా నమోదు చేయబడిన అర్జీల సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని, అన్ని మండల కార్యాలయాల్లో అర్జీలు తీసుకుంటామన్నారు.
News December 28, 2025
కర్రెగుట్టలో భారీగా బయటపడ్డ మందుపాతరలు

ములుగు జిల్లాలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భారీగా మందుపాతరలు (IEDలు) బయటపడటం కలకలం రేపింది. మొర్మూరు నుంచి కర్రెగుట్టలకు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా, వందల సంఖ్యలో ఐఈడీలను గుర్తించారు. పామునూరు శివారు ప్రాంతాన్ని బాంబ్ డిస్పోజల్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
News December 28, 2025
MDK: యువతి మృతి.. ప్రియుడే కారణమంటూ ధర్నా

ప్రియుడి ఇంటి ముందు యువతి మృతదేహంతో ధర్నా చేసిన ఘటన నిజాంపేట్ (M) మాణిక్ నాయక్ తండా జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. కావేరి, శ్రీకాంత్‌లు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా నిన్న కావేరి మృతి చెందినట్లు శ్రీకాంత్ ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమె మరణానికి శ్రీకాంతే కారణమంటూ బంధువులతో కలిసి అతడి ఇంటి ముందు ధర్నాకు దిగారు.


