News March 3, 2025
తీవ్రమైన బాధతో దిగిపోతున్నా.. బట్లర్ ఎమోషనల్ పోస్ట్

ODI, T20ల్లో వరుస ఓటములతో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘తీవ్రమైన బాధతో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. దేశానికి కెప్టెన్సీ వహించడం గొప్ప గౌరవం. దీనికి ఎంతో గర్విస్తున్నా. నా రిజైన్‌కు ఇదే సరైన సమయం. నాకు సహకరించిన ప్లేయర్లు, అభిమానులతోపాటు నా భార్య లూయిస్, ఫ్యామిలీకి థాంక్స్. వారే నా జర్నీకి అసలైన పిల్లర్లు’ అని రాసుకొచ్చారు.
Similar News
News March 4, 2025
మార్చి 04: చరిత్రలో ఈ రోజు

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం
News March 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2025
యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్లే: జెలెన్‌స్కీ

రష్యాతో యుద్ధ ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి తమకు మద్ధతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యూఎస్‌తో మా బంధం ఇప్పటిది కాదు. అందుకే మా సంబంధం కొనసాగుతుందని భావిస్తున్నా. అమెరికాతో డీల్‌కు మేం సిద్ధం. ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటారు. ఇందులో సందేహమే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.